జనవరి 9 – జాస్సీ ఒప్పందంతో క్రిమియా గురించి ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు చేస్తున్న యుద్ధం ముగిసింది. [1]
ఫిబ్రవరి 20 – యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ విభాగాన్ని స్థాపించే పోస్టల్ సర్వీస్ చట్టంపై అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ సంతకం చేశాడు. [2]
ఫిబ్రవరి 20 – డబ్లిన్‌లోని పార్లమెంటు సమావేశాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. తదనంతరం చేసిన ప్రకటనలో, "పైకప్పు కూలిపోవటం ఖాయంగా కనిపించినప్పటికీ, సభ వాయిదా వెయ్యాలని తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించేవరకూ సభను వాయిదా వెయ్యలేదు" అని చెప్పారు. [3]
మార్చి 1 – చివరి పవిత్ర రోమన్ చక్రవర్తి, ఫ్రాన్సిస్ II పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
మార్చి 16 – స్టాక్‌హోమ్‌లోని రాయల్ ఒపెరాలో అర్ధరాత్రి స్వీడన్ రాజు గుస్తావ్ III ను జాకబ్ జోహన్ అంకర్స్ట్రోమ్ కాల్చడంతో, అతను మార్చి 29 న మరణించాడు. తరువాత అతని 14 సంవత్సరాల కుమారుడు గుస్తావ్ IV అడాల్ఫ్ రాజయ్యాడు.
మే 17: బటన్వుడ్ ఒప్పందం కుదురడంతో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైంది.
మే 21: జపాన్‌లోని మౌంట్ అన్జెన్ అగ్నిపర్వతం కార్యకలాపాల కారణంగా హిమపాతం, సునామీ చెలరేగి 14,300 మంది మరణించారు.
సెప్టెంబర్ 2 – 7: ఫ్రెంచ్ విప్లవంలో సెప్టెంబరు ఊచకోత: దుండగుల గుంపులు ముగ్గురు రోమన్ కాథలిక్ బిషప్‌లను, 200 మందికి పైగా పూజారులను, కనీసం 1,000 మంది నేరస్థులనూ చంపేసాయి.
సెప్టెంబర్ 14 – దేశద్రోహానికి పాల్పడినట్లు తేలడంతో థామస్ పైన్ ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్‌కు పారిపోయాడు. అతన్ని గైర్హాజరులో విచారించి డిసెంబరులో నేరస్థుడిగా నిర్ధారించారు.[4]
↑Harper's Encyclopaedia of United States History from 458 A. D. to 1909, ed. by Benson John Lossing and, Woodrow Wilson (Harper & Brothers, 1910) p169
↑"Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) pp62
↑Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 232–233. ISBN978-0-7126-5616-0.